ఏం మాట్లాడాలన్నా భయంగా ఉంది.. అందుకే సెలబ్రిటీలంతా ఫ్రీజ్ అయి ఉంటున్నారు: నాగార్జున

by Mallepaka Hamsa |

ఒకప్పుడు సినిమా ప్రమోషన్స్ లేదా ప్రెస్ మీట్స్ అంటే కేవలం ఒక ఆరుగురు జర్నలిస్టులు, ఒకే ఒక్క ఫోటోగ్రాఫర్ మాత్రమే ఉండేవారని ఆయన గుర్తు చేసుకున్నారు.

ఏం మాట్లాడాలన్నా భయంగా ఉంది.. అందుకే సెలబ్రిటీలంతా ఫ్రీజ్ అయి ఉంటున్నారు: నాగార్జున
X

దిశ, సినిమా: అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ ప్రధాన పాత్రలో నటించిన ‘లెనిన్’ సినిమా జూలై 10న థియేటర్స్‌లోకి రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు. అయితే ఈ సినిమాను మురళి కిషోర్ అబ్బూరి తెరకెక్కించారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతుండగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్‌పై నాగవంశీ, అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో.. చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఈ వేడుకల్లో పాల్గొన్న నాగార్జున షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడ ఉన్న మీడియా మిత్రులందరినీ చూస్తుంటే తనకు తన కెరీర్ ప్రారంభ రోజులు గుర్తొస్తున్నాయని నాగార్జున ఎమోషనల్ అయ్యారు. ఒకప్పుడు సినిమా ప్రమోషన్స్ లేదా ప్రెస్ మీట్స్ అంటే కేవలం ఒక ఆరుగురు జర్నలిస్టులు, ఒకే ఒక్క ఫోటోగ్రాఫర్ మాత్రమే ఉండేవారని ఆయన గుర్తు చేసుకున్నారు.

అప్పట్లో ఇప్పటిలాగా చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు, నిరంతరం రికార్డ్ చేసే కెమెరాలు, డిజిటల్ రికార్డింగ్స్ వంటివి ఏమీ ఉండేవి కావని చెప్పారు. రేపు సినిమా రిలీజ్ అవుతుంది అనగా కేవలం ఆ ఆరుగురు వ్యక్తులు మాత్రమే వచ్చి కూర్చునేవాళ్లని, వాళ్లే ఎంతో స్నేహపూర్వకంగా ప్రశ్నలు అడిగేవారని నాగార్జున పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. పైగా ఆ రోజుల్లో మీడియా ముందు మాట్లాడటానికి ఎలాంటి భయం కూడా ఉండేది కాదని ఆయన స్పష్టం చేశారు. కానీ, ఇప్పటి పరిస్థితి పూర్తిగా మారిపోయిందని నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మీడియా ముందు నిలబడి మాట్లాడాలంటేనే మనసులో ఒక రకమైన భయం వేస్తోందని ఆయన చెప్పారు. ఎక్కడ ఏ కెమెరా పెడతారో, ఎవరు ఎలాంటి ప్రశ్న అడుగుతారో, దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తారో తెలియని గందరగోళం ఉంటోందని అన్నారు. ఈ విపరీతమైన కెమెరాల నిఘా, ఒత్తిడి వల్లే ప్రస్తుతం సెలబ్రిటీలందరూ మీడియా ముందు అంత ఫ్రీగా ఉండలేకపోతున్నారని, ఎక్కడికక్కడ ఫ్రీజ్ అయిపోయి కనిపిస్తున్నారని నాగార్జున వివరించారు.

Next Story