- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజావాణి ఫిర్యాదు పై ఎంఈఓ ఆకస్మిక తనిఖీలు
ప్రజావాణిలో అందిన ఫిర్యాదు మేరకు ఆలూరు మండల విద్యాశాఖాధికారి ఎం.నరేందర్ బుధవారం ఆలూరు మండల పరిధిలోని కల్లడి గ్రామంలోని హోవర్డ్ పార్క్, వాగ్దేవి ప్రైవేట్ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

దిశ, ఆలూర్ : ప్రజావాణిలో అందిన ఫిర్యాదు మేరకు ఆలూరు మండల విద్యాశాఖాధికారి ఎం.నరేందర్ బుధవారం ఆలూరు మండల పరిధిలోని కల్లడి గ్రామంలోని హోవర్డ్ పార్క్, వాగ్దేవి ప్రైవేట్ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల సందర్భంగా హోవర్డ్ పార్క్ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను విక్రయిస్తున్నట్లు గుర్తించిన ఎంఈఓ, పాఠ్యపుస్తకాల నిల్వ గదికి సీల్ వేసి యాజమాన్యానికి నోటీసు జారీ చేశారు. అలాగే శిక్షణ పొందని ఉపాధ్యాయులతో బోధన నిర్వహిస్తున్నట్లు గుర్తించి, వెంటనే అర్హత కలిగిన, శిక్షణ పొందిన ఉపాధ్యాయులతోనే తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా హోవర్డ్ పార్క్, వాగ్దేవి పాఠశాలల యాజమాన్యాలకు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసిన ఎంఈఓ, ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. మండలంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలు విద్యాశాఖ మార్గదర్శకాల మేరకు విద్యాబోధన, నిర్వహణ చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించే పాఠశాలలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.






