సంబంధాల్లో ఆ తరహా మౌనం.. ప్రేమ కాదు, టాక్సిక్..!

by Javid Pasha |

ఏదో ఒక్కసారి అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రతీసారి, ప్రతీరోజు మౌనమే సమాధానమైతే.. ఉద్దేశ పూర్వకం కావచ్చు!

సంబంధాల్లో ఆ తరహా మౌనం.. ప్రేమ కాదు, టాక్సిక్..!
X

దిశ, ఫీచర్స్ : ఒకరు మాట్లాడటం ఆపేస్తే, మరొకరు ప్రాణంకొద్దీ మాట్లాడాలని ఆరాటపడతారు. ఒకరు మెసేజ్‌లు, రిప్లైలు ఆపేస్తారు. మరొకరు మాత్రం ఎంతో ఆశతో మెసేజ్‌లు పెడుతూనే ఉంటారు. ఒకరు మౌనం వహిస్తే, మరొకరు ఆ మౌనాన్ని బద్దలు కొట్టాలని ప్రయత్నిస్తారు. ఇది ప్రేమ కాదు. టాక్సిక్ రిలేషన్‌షిప్ అంటున్నారు నిపుణులు. ఇటీవల మిలీనియల్స్‌లో, జెన్ Zలో ఈ తరహా ధోరణి పెరిగిపోతోందని చెబుతున్నారు. అయితే దీనిని ఎలా గుర్తించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అన్నీ వన్‌సైడ్ అయితే..

అవతలి వ్యక్తిపై ప్రేమకొద్దీ మెసేజ్ చేయడానికి, మాట్లాడటానికి మీరు మాత్రమే ప్రయత్నిస్తూ ఉండటం, రెస్పాండ్ అవకపోతే బాధపడుతూ ఉండటం చేస్తుంటే.. అది వన్‌సైడ్ లవ్..! అవతలి వ్యక్తికి ఇష్టం లేనప్పుడు ఎంత చేస్తే ఏం ఫలితం? అందుకే డ్రాప్ అవడం బెటర్ అంటారు నిపుణులు. ఒకవేళ అప్పటికే సంబంధంలో ఉండి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంటే గనుక అది టాక్సిక్ రిలేషన్‌షిప్.. అంటే త్వరలో బ్రేకప్ లేదా విడాలకు జరగొచ్చు. ఎందుకంటే అవతలి వ్యక్తికి మీరు ఇష్టం లేదు లేదా నచ్చడం లేదదని అర్థం చేసుకోవచ్చు.

మౌనం వెనుక అర్థం..!

ఏదో ఒక్కసారి అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఒకటికి పదిసార్లు, ప్రతిరోజూ అవతలి వ్యక్తి మౌనమే సమాధానంగా ఉంటే.. అది పొరపాటో, తప్పిదమో, అవగాహన రాహిత్యమో కాదు. మీరంటే ఇష్టంలేక తీసుకున్న ఉద్దేశ పూర్వక నిర్ణయం. ఇటీవల సంబంధాలలో ఇలాంటివి పెరిగిపోతున్నాయి. దీనినే కొందరు టాక్సిక్ రిలేషన్‌షిప్‌గా వర్ణిస్తున్నారు. ఒక విధంగా ఇది అవతలి వ్యక్తి మిమ్మల్ని ‘మీరు నాకు వద్దు’ అని చెప్పడమే. నేరుగానో, ముఖం మీదనో చెబితే మీరు వినరనో, మరీ ఎక్కువ ఫీలవుతారనో, బాధ పడతారనో, భయ పడతారనో, భయ పెడతారనో భావించినప్పుడు అలా బిహేవ్ చేస్తుంటారని రిలేషన్‌షిప్ అండ్ మోటివేషనల్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఇలాంటి సంబంధాలకు దూరంగా ఉండటం లేదా వదులుకోవడమే మంచిది. లేకుంటే అది మరింత టాక్సిక్ రిలేషన్‌షిప్‌గా మారిపోయి మిమ్మల్ని బాధకు గురిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

భారం.. బాధ, బాధ్యత

ఇద్దరూ కలిసి జీవించాలనుకున్నప్పుడు ఒక్కరే మాట్లాడటం, ఒక్కరే చొరవ తీసుకోవడం, ఒక్కరే ప్రేమించడం, ఒక్కరే బాధను, బాధ్యతను మోయడం, ఒక్కరే ప్రేమించడం సాధ్యం కాదు. ఒకవేళ అలాంటి ప్రయత్నం చేసినా, జరిగినా బాధలు, కష్టాలు తప్ప ఒరిగేది ఏమీ ఉండవని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇలాంటి వన్‌సైడ్ సంబంధాలకోసం బాధపడేకంటే.. వదిలేయడం బెటర్ అంటున్నారు. ఎందుకంటే.. ఒకవైపు ప్రయత్నం మాత్రమే ఉన్నప్పుడు అది ప్రేమ కాదు. కేవలం మీ వైపు నుంచి కొనసాగుతున్న భావోద్వేగ శ్రమ (emotional labor) మాత్రమే. అవతలి వ్యక్తికి ఆసక్తి లేనప్పుడు, ఇష్టం లేనప్పుడు, ప్రేమ లేనప్పుడు ఆ వ్యక్తికోసం మీరు ఎంత ఎక్కువ ప్రయత్నిస్తే అంత ఎక్కువ అలసిపోతారు. ఫలితం దక్కక ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోతుంది. అందుకే బాధగా అనిపించినా సరే.. కొన్ని బంధాలను వదులుకోవడమే మంచిదని, ముఖ్యంగా వన్‌సైడ్ ప్రేమలు, సంబంధాలకు దూరంగా ఉండటమే బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story