Prudhvi Raj: ఆయన నాకు గురువుతో సమానం.. ఆ తమిళ సినిమాలో విలన్‌గా కనిపించనున్నా

by Pulgam srinivas |

తమిళంలో చియాన్ విక్రమ్ నాకు గురువుతో సమానం అని నటుడు పృథ్వీరాజ్ పేర్కొన్నారు.

Prudhvi Raj: ఆయన నాకు గురువుతో సమానం.. ఆ తమిళ సినిమాలో విలన్‌గా కనిపించనున్నా
X

దిశ, వెబ్ డెస్క్: ఖడ్గం చిత్రంలో "30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ" అనే ఒక్క డైలాగ్‌తో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న నటుడు పృథ్వీరాజ్. అయితే ఆ సినిమా తర్వాత చాలా కాలం పాటు ఆయనకు చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. అలాంటి సమయంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన లౌక్యం చిత్రంలో వచ్చిన పాత్ర ఆయన కెరీర్‌కు మళ్లీ ఊపునిచ్చింది. ఆ సినిమాలో తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన పృథ్వీరాజ్‌కు భారీ స్థాయిలో గుర్తింపు లభించింది. అనంతరం వరుసగా తెలుగు చిత్రాల్లో కమెడియన్ పాత్రలు దక్కించుకుని చాలా కాలం పాటు విజయవంతంగా కెరీర్‌ను కొనసాగించారు.

అయితే ఇటీవల కాలంలో తెలుగులో అవకాశాలు కొంత తగ్గినప్పటికీ, తమిళ చిత్ర పరిశ్రమలో మాత్రం వరుస అవకాశాలు అందుకుంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కొత్త ప్రాజెక్టుల గురించి పృథ్వీరాజ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. "తమిళంలో చియాన్ విక్రమ్ నాకు గురువుతో సమానం. ధ్రువ్ విక్రమ్ సినిమా కోసం కూడా విక్రమ్ గారే నా పేరును సూచించారు. ప్రస్తుతం సూర్య హీరోగా, 'జై భీమ్' దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నెగిటివ్ పాత్ర కోసం డేట్స్ ఇచ్చాను. అలాగే విశాల్ నటిస్తున్న మరో చిత్రంలో కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాను" అని తెలిపారు. ఈ చిత్రాలు విజయవంతమైతే పృథ్వీరాజ్ తమిళ చిత్ర పరిశ్రమలో బిజీ నటుడిగా మారే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story