- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధరణి, భూభారతి అక్రమాల డైవర్షన్ కే కాళేశ్వరం డ్రామా: రామచందర్ రావు
ధరణి, భూభారతి అక్రమాలపై సిట్ విచారణ జరపాలని బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‍లపై మండిపడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ధరణిలో అక్రమాలు నిజమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. ధరణితో పాటు భూభారతిలోనూ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ధరణితో పాటు భూభారతిపైనా సిట్ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఇవాళ బీజేపీ స్టేట్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ధరణి, భూభారతి అవకతవకలు బయటపడుతున్నాయనే కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి కన్నెపల్లి అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఇది కాళేశ్వరం, కూలేశ్వరం కాదు ఈ రెండు పార్టీలు కలిసి చేస్తున్న డ్రామేశ్వరం అని ఎద్దేవా చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ కోసమే కాళేశ్వరం అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారన్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్టే బీజేపీ విధానం అన్నారు. ఇకనైనా రాజకీయాలు పక్కన పెట్టి అవసరమైన మరమ్మతులు చేపట్టాలన్నారు. రాజకీయాల కోసం రైతులను ఇబ్బంది పెట్టవద్దన్నారు.
బీజేపీ కృషితోనే తాటిచర్ల-2 గని:
కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వేలం లేకుండానే తాటిచర్ల-2 బొగ్గు గనిని సింగరేణికి కేటాయించిందని చెప్పారు. సింగరేణి విషయంలో ఎప్పుడైనా బీజేపీ ప్రభుత్వాలే కాపాడాయి తప్ప కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏమి చేయలేదన్నారు. ఈ బ్లాక్ ద్వారా సంస్థకు రూ.64 వేల కోట్ల ఆదాయంతో పాటు 1200 అదనపు ఉద్యోగాలు రాబోతున్నాయన్నారు. తాటిచర్ల-2 తమ ప్రయత్నం చెప్పుకుంటున్న కాంగ్రెస్ చెప్పుకుంటోందని ఇదే నిజం అయితే మన్ మోహన్ సింగ్ హాయంలో ఎందుకు రాలేదన్నారు. ఈ గని రావడం వెనుక కేంద్రప్రభుత్వం, కిషన్ రెడ్డి కృషి ఉందన్నారు. తాటిచర్ల గనిని కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.






