- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మానవత్వం చాటుకున్న మున్సిపల్ చైర్ పర్సన్
by Batti.Sumithra |
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని గుర్తుతెలియని అనాథ వృద్ధుడి మృతదేహానికి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు చేయించి ఖానాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ అంకం మౌనిక మహేందర్ మానవత్వం చాటుకున్నారు.

X
దిశ, ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని గుర్తుతెలియని అనాథ వృద్ధుడి మృతదేహానికి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు చేయించి ఖానాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ అంకం మౌనిక మహేందర్ మానవత్వం చాటుకున్నారు. ఖానాపూర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో గుర్తు తెలియని ఒక వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్పర్సన్ వెంటనే స్పందించి మున్సిపల్ సిబ్బంది, పోలీసుల సహాయంతో మృతదేహాన్ని గోదావరి నది తీరానికి తరలించి అంత్యక్రియలు జరిపించారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ తొడసం ఇందిర, ఖానాపూర్ ఎస్సై రాహుల్ గైక్వాడ్, బీజేపీ నాయకులు రమేష్, సుధాకర్, శ్రీనివాస్, మున్సిపాలిటీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Next Story






