ఆ మాత్రం తేడా తెలియకపోతే ఎలా.. మంత్రి కొండా సురేఖ ఫిర్యాదుపై కడియం శ్రీహరి రియాక్షన్

by Prasad Jukanti |

మంత్రి కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి మధ్య విభేదాలు హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశంలో తాజాగా కడియం శ్రీహరి స్పందించారు.

ఆ మాత్రం తేడా తెలియకపోతే ఎలా.. మంత్రి కొండా సురేఖ ఫిర్యాదుపై కడియం శ్రీహరి రియాక్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి కొండాసురేఖ వర్సెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు అధికార కాంగ్రెస్ పార్టీలో మరోసారి భగ్గుమన్నాయి. స్టేషన్ ఘన్‍పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దేవాదాయశాఖలో అధికారిక సమీక్ష నిర్వహించారని...మంత్రి కొండా సురేఖ ఆరోపించాడం సంచలనంగా మారింది. కడియం శ్రీహరి 'రూల్స్ ఆఫ్ బిజినెస్' ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపిస్తూ...నేరుగా C.M రేవంత్ రెడ్డికి లేఖ రాయడంతో పాటు ఏఐసీసీ పెద్దలకు సైతం ఫిర్యాదు చేయడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ ఫిర్యాదుపై కడియం శ్రీహరి స్పందించారు. ప్రజల మధ్య లేనివాళ్లు.. కాంట్రవర్సీలతో లైమ్‍లైట్‍లో ఉండేందుకు ప్రయత్నం చేస్తుంటారని, తమశాఖ అధికారులకు తమకు తెలియకుండా కలవడమేంటి అని ప్రశ్నించడం అవివేకం అన్నారు.

ఎవరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు:

మంత్రి తనను తప్పుగా అర్థం చేసుకున్నారని తాను ఎలాంటి తప్పూ చేయలేదని ఈ విషయంలో వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఒక ప్రజాప్రతినిధిగా ఏ అధికారినైనా కలిసి సమస్యలపై వినతిపత్రం ఇచ్చే హక్కు తనకు ఉందన్నారు. అదే కోవలా తాను తన నియోజకవర్గానికి సంబంధించిన దేవాలయాల అభివృద్ధి గురించి తాను సంబంధింత శాఖ అధికారుల వద్దకు వెళ్లానన్నారు. అధికారులను తన వద్దకు పిలిపించుకోలేదని తానే అధికారుల వద్దకు వెళ్లాలని చెప్పారు. అభివృద్ధిని పట్టించుకోని వారే వివాదాలు సృష్టిస్తున్నారని, తాము సమీక్షలు చేయలేదని, కేవలం ఆలయాల అభివృద్ధి కోసమే దేవాదాయ శాఖ కార్యాలయానికి వెళ్లానని స్పష్టం చేశారు. సమీక్షకు, సమస్యలపై వినతి పత్రం ఇవ్వడానికి చాలా తేడా ఉందన్నారు. రాజ్యాంగం ప్రకారం సమీక్ష కేవలం మంత్రులు, కేబినెట్ ర్యాంక్ ఉన్న వారు మాత్రమే చేయగలరు. ఎమ్మెల్యేలు, ఎంపీలు సమీక్షలో పాల్గొంటారన్నారు. నా పనులు నేను చేసుకుంటూ వెళ్తుంటే ఇలా మాట్లాడం బాధేస్తుందన్నారు. ఇది మంచి పరిణామం కాదన్నారు. నేను ఎక్కడ తప్పు చేయలేదని నేను ఎవరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. మాకు తెలియకుండా మా శాఖ అధికారుల వద్దకు వెళ్లొద్దనడం నేను ఎక్కడా వినలేదన్నారు.

Next Story