- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ప్రశ్న రావణ్’ ఫోన్‌లో అశ్లీల వీడియోలు.. 10 మంది బాధితుల గుర్తింపు
యూట్యూబర్ 'ప్రశ్న రావణ్' మొబైల్ ఫోన్ ఫోరెన్సిక్ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)లపై అనుచిత వ్యాఖ్యాల నేపథ్యంలో వివిధ కేసుల్లో అరెస్ట్ అయిన యూట్యూబర్ ప్రశ్న రావణ్ (Prashna Ravan) అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగు చేస్తున్నాయి. తాజాగా అతడి మొబైల్ ఫోన్‌కు సంబంధించిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) నివేదిక రావడంతో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. రావణ్ తన మొబైల్ ఫోన్ ద్వారా అమాయక యువతులను తీవ్రంగా వేధించినట్లుగా బలమైన ఎవిడెన్స్‌లు లభ్యమయ్యాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ రికవరీ చేసిన డేటా ప్రకారం.. నిందితుడు అశ్లీల వీడియోలను (Obscene Videos) ఉపయోగించి పలువురు యువతులను లైంగికంగా, మానసికంగా వేధించినట్లుగా సమాచారం అందుతోంది.
రంగంలోకి పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం
ప్రశ్న రావణ్ ఫోన్ నుంచి లభించిన డిజిటల్ డేటా ఆధారంగా పోలీసులు ఇప్పటివరకు సుమారు 10 మంది బాధితులను (Victims) గుర్తించినట్లుగా తెలుస్తోంది. నిందితుడు వారి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడి అలా ఎంతమందిని వేధించాడనే కోణంలో పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచి, వారి నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.






