- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల తాకట్టు పెట్టైనా ఇచ్చిన హామీలు నెరవేర్చుతాం - మంత్రి పొంగులేటి
చ్చిన హామీలు నెరవేర్చుతామని ప్రకటించారు రాష్ట్ర రెవెన్యూ సమాచార పౌర సంబంధాలు శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

దిశ వనపర్తి : తల తాకట్టు పెట్టైనా ఇచ్చిన హామీలు నెరవేర్చుతామని ప్రకటించారు రాష్ట్ర రెవెన్యూ సమాచార పౌర సంబంధాలు శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వేల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు వివరించారు. వనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు తుడి మేఘా రెడ్డి ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నట్లు తెలిపారు.
నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని, ప్రజా గొంతుక వినిపిస్తున్నారన్నారు. రాష్ట్ర రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, తుడి మేఘా రెడ్డిలతో కలిసి బుధవారం వనపర్తి నియోజకవర్గంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం(రూ. 3కొట్లు),వనపర్తి రాజమహల్(రూ.10కోట్లు) పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల గృహాల పంపిణీ కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
ఎప్పుడు వచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా అన్న డైలాగ్ తో వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వనపర్తిని బీఆర్ఎస్ పార్టీ కంటే, తామే రెండేళ్లలో ఎక్కువగా అభివృద్ధి చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు






