- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు వైయస్సార్: ఎమ్మెల్యే
తెలంగాణ, ఆంధ్రా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు వైయస్ రాజశేఖర్ రెడ్డిని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు.

దిశ, సత్తుపల్లి: తెలంగాణ, ఆంధ్రా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు వైయస్ రాజశేఖర్ రెడ్డిని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. బుధవారం వైయస్సార్ జయంతిని పురస్కరించుకొని సత్తుపల్లి మున్సిపల్ పరిధిలో మెయిన్ రోడ్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆమె జయంతి సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ తో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పేద ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా 104, 108,102, ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు స్కాలర్షిప్ రైతులకు ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇల్లు వంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రతి పథకం పేద ప్రజలకు అందించిన మహానేత వైయస్సార్ వైయస్సార్ తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిరంగా ఎన్నటికి నిలిచే ఉంటారని ఆమె పేర్కొన్నారు. ఈ జన్మదిన వేడుకలలో సత్తుపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ ఎండీ రెహనా బేగం కమల్ పాషా, వైస్ చైర్ పర్సన్ బోంతు సుమలత, మున్సిపల్ కౌన్సిలర్లు, మండల అధ్యక్షులు భీమిరెడ్డి సుబ్బారెడ్డి, పట్టణ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, సీనియర్ నాయకులు చళ్ళగుళ్ళ నరసింహ, మందపాటి ముత్తా రెడ్డి, ఎండీ కమల్ పాషా, గొర్ల రామ్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వైయస్సార్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.






