- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కస్టమర్లను మోసం చేస్తే ఊరుకోం: ఆ మూడు సంస్థలకు ‘FSSAI’ నోటీసులు
ప్యాక్ చేసిన ఆహార ఉత్పత్తులపై తప్పుడు క్లెయిమ్స్ చేస్తున్న బ్రాండ్లకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) లీగల్ నోటీసులు జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్యాకింగ్ ఫుడ్ ప్రొడక్ట్స్‌పై ఈ మధ్యకాలంలో భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (FSSAI) ఫుల్ ఫోకస్ పెట్టింది. సదరు కంపెనీలు చేస్తున్న తప్పుడు ప్రకటనలు, కస్టమర్లను తప్పుదోవ పట్టించేలా క్లెయిమ్ చేస్తున్న అంశాలపై డైరెక్ట్‌గా యాక్షన్‌లోకి దిగింది. ఈ క్రమంలోనే పలు దిగ్గజ కార్పొరేట్ బ్రాండ్లకు సైతం లీగల్ నోటీసులు ఇచ్చెందుకు FSSAI ఏమాత్రం వెనుకాడటం లేదు. తాజాగా ప్రముఖ చాక్లెట్, కన్ఫెక్షనరీ బ్రాండ్ లోట్టే ఇండియా (Lotte India), గిఫ్టింగ్ పోర్టల్ ఫెర్న్స్ ఎన్ పెటల్స్ (Ferns N Petals)తో పాటు కుబేర ఫుడ్స్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006 నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ.. వారిపై ఎందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆయా కంపెనీలను FSSAI ఆదేశించింది.
100 శాతం వెజిటేరియన్ అంటూ క్లెయిమ్..
వివరాల్లోకి వెళితే.. చాక్లెట్ బ్రాండ్ లోట్టే ఇండియాకు చెందిన కొన్ని ‘చోకో పై’ ఉత్పత్తులపై 100 శాతం వెజిటేరియన్ క్లెయిమ్స్‌ను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఫ్లాగ్ చేసింది. వీటితో పాటు కంపెనీకి చెందిన ఫ్రూట్జ్ ఎక్లైర్స్ (Fruitz Eclairs) చాక్లెట్లలో అసలు పండ్ల కంటెంట్ (Fruits) లేకపోయినప్పటికీ.. వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఆ పేరును వాడుతున్నట్లు గుర్తించింది. అదేవిధంగా మరో సంస్థ రోస్టెడ్ ఆల్మండ్ చాక్లెట్ (Roasted Almond Chocolate)పై FSSAI అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చాక్లెట్‌లో హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నప్పటికీ, దానిని ప్రీమియం చాక్లెట్‌గా మార్కెట్ చేస్తున్నట్లు తేల్చింది. ఇక కుబేర ఫుడ్స్ (Kuberra Foods) సాఫ్ట్ అండ్ ఫ్రెష్ క్రీమ్ బన్ పైనాపిల్ ప్యాకెట్‌పై 100 శాతం నేచురల్, నో ప్రిజర్వేటివ్స్, కలర్స్ అండ్ ఫ్లేవర్స్ అని ముద్రించారు. కానీ, లోపల ఉన్న లేబుల్‌పై మాత్రం ప్రిజర్వేటివ్స్, సింథటిక్ ఫుడ్ కలర్, అదనపు ఫ్లేవర్స్ వాడినట్లు ప్రింట్ చేయడంతో FSSAI ఆ మూడు సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ప్రతి సంస్థ తమ ప్రొడక్ట్స్‌కు సంబంధించి కస్టమర్లకు సరైన సమాచారం ఇవ్వాలని.. లేని పక్షంలో భాధ్యులపై కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.






