గొంతు కోసుకుని యువకుడు మృతి

by Jakkula.Mamatha |   (  Updated:2026-07-08 07:19:45  IST  )

కొమురం భీం జిల్లా దహెగాం మండలం కుంచవెల్లి గ్రామంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది.

గొంతు కోసుకుని యువకుడు మృతి
X

దిశ, బెజ్జూర్: కొమురం భీం జిల్లా దహెగాం మండలం కుంచవెల్లి గ్రామంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన లంగారి సుమన్(30) అనే వ్యక్తి కత్తితో గొంతు కోసుకుని బుధవారం మృతి చెందాడు. మృతికి గల‌ కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న దహెగాం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story