ఎవరెన్ని తప్పులు చేసినా AI పట్టేస్తుంది: అడిషనల్ కలెక్టర్

by Jakkula.Mamatha |

SIR ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని నారాయణపేట జిల్లా అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) శ్రీను పిలుపునిచ్చారు.

ఎవరెన్ని తప్పులు చేసినా AI పట్టేస్తుంది: అడిషనల్ కలెక్టర్
X

దిశ, మక్తల్: SIR ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని నారాయణపేట జిల్లా అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) శ్రీను పిలుపునిచ్చారు. బుధవారం మక్తల్ తహసీల్దార్ కార్యాలయంలో పార్టీ నాయకులు, అధికారులతో తహసీల్దార్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ నమోదులో డబుల్ ఎంట్రీలు, షిఫ్టింగ్, మృతి చెందిన వారి వివరాల నమోదు వంటి తప్పులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) తక్షణమే గుర్తించేస్తుందని స్పష్టం చేశారు. బీఎల్‌వోలు లేదా ఇన్ఛార్జీలు ఈ ప్రక్రియలో పనిచేయడాన్ని నామోషిగా భావించకుండా, బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు.

ఈ నెల 20వ తేదీ లోపు ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. జులై 31న వెలువడే జాబితాతో బీఎల్‌వోలు, ఇన్ఛార్జీల పనితీరు వెల్లడవుతుందని, దాన్ని బట్టే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఎస్ఐఆర్ నమోదుకు కావాల్సిన అన్ని వివరాలను సేకరించి, దరఖాస్తులను పగడ్బందీగా నింపాలి. ఈ నెల 24వ తేదీ నాటికి ప్రభుత్వం నిర్దేశించిన పనులను పూర్తి చేస్తే, రాబోయే రెండు నెలలు బి.ఎల్.వోలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. సేకరించిన వివరాలను ఎప్పటికప్పుడు కంప్యూటర్ లో పక్కాగా నమోదు చేయాలి. నమోదు ప్రక్రియలో ఏవైనా సందేహాలు ఉంటే స్థానిక తహశీల్దార్లకు లేదా నేరుగా తనకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని అడిషనల్ కలెక్టర్ తెలిపారు. ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ఈ సర్వే ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ సమావేశంలో తహసీల్దార్ సతీష్ కుమార్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Next Story