చొప్పదండిని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం

by velandi.Saikiran |

గంగాధర మండల కేంద్రానికి చెందిన ప్రముఖ నాయకుడు చిరుత మంగ రమేష్ తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

చొప్పదండిని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం
X

దిశ, గంగాధర: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతిని చూసి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బుధవారం గంగాధర మండల కేంద్రానికి చెందిన ప్రముఖ నాయకుడు చిరుత మంగ రమేష్ తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గంగాధర ప్రజా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజా రంజక పాలన అందిస్తోందని, నిరంతరం ప్రజాసేవలో ఉంటూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకూ తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయని హామీ ఇచ్చారు. చొప్పదండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపి, రాబోయే రోజుల్లో రాష్ట్రానికే ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంత్రి మహేందర్, సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్ రావు, తోట కరుణాకర్, సర్పంచ్‌ల ఫోరమ్ అధ్యక్షుడు ముద్దం నగేష్, సర్పంచ్ రేండ్ల శ్రీనివాస్, వేముల భాస్కర్, పడాల రాజన్న, మాజీ జెడ్పీటీసీ గునుకొండ బాబు, సాగి అజయ్ రావు, వేముల అంజి, కర్ర బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story