- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్-రష్మిక దారిలోనే తరుణ్ భాస్కర్- ఈషా రెబ్బా.. త్వరలోనే పెళ్లి!
ఆయన వర్క్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుని, ఈషాతో కలిసి వెకేషన్‌కు వెళ్తుండటంతో వీరి ప్రేమ వార్తలకు మరింత బలం చేకూరినట్లు అయింది.

దిశ, సినిమా: టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బా గత కొద్ది కాలంగా ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పలు పుకార్లు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన తరుణ్ భాస్కర్.. ఇటీవల ఈషా రెబ్బాతో కలిసి ‘ఓంశాంతి శాంతి శాంతి’ అనే సినిమాలో నటించారు. అయితే, ఈ మూవీ షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే చర్చగత కొద్ది కాలంగా జరుగుతోంది. ఈ ప్రేమ వ్యవహారంపై ఈషా రెబ్బా ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడా స్పందించనప్పటికీ, తరుణ్ భాస్కర్ మాత్రం ఒక సందర్భంలో మాట్లాడుతూ.. తనకు అన్నీ ఈషానే అంటూ ఓపెన్ గా పేర్కొనడం విశేషం. అంతేకాకుండా, సరైన సమయం చూసి తమ బంధం గురించి అధికారిక ప్రకటన చేస్తానని ఆయన అనడంతో అంతా వీరి ప్రేమాయణం నిజమేనని గట్టిగా నమ్మారు. తాజాగా వీరిద్దరు కలిసి మరోసారి కెమెరా కంటికి చిక్కడంతో ఈ ప్రేమ పుకార్లు సోషల్ మీడియాలో మళ్లీ సంచలనంగా మారాయి.
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా కలిసి ఎయిర్‌పోర్ట్‌లో పక్కపక్కన నడుస్తూ కనిపించడమే ఇందుకు కారణం. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఎలాంటి సినిమా చేయడం లేదు. తరుణ్ భాస్కర్ తన తదుపరి డైరెక్టోరియల్ మూవీ ‘ఈ నగరానికి ఏమైంది-2’ మేకింగ్ పనుల్లో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయన వర్క్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుని, ఈషాతో కలిసి వెకేషన్‌కు వెళ్తుండటంతో వీరి ప్రేమ వార్తలకు మరింత బలం చేకూరినట్లు అయింది. వీరు త్వరలోనే పెళ్లి గురించిన శుభవార్త చెబితే ఆశ్చర్యపోనవసరం లేదని నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. గతంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కూడా ఇలాగే సీక్రెట్ రిలేషన్‌షిప్ కొనసాగించి, ఆ తర్వాత పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా కూడా వారి దారినే ఫాలో అవుతున్నారని, వాళ్ల లాగే వీళ్లు కూడా త్వరలోనే తమ పెళ్లి డేట్‌ను అనౌన్స్ చేయబోతున్నారని నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది.






