- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లోకేష్, చంద్రబాబుకు రావణ్ అనుకూలంగా పనిచేస్తున్నాడు: కొడాలి నాని
బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్అనే వ్యక్తి పూర్తిగా టిడిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు..

దిశ, వెబ్ డెస్క్: బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్( Prasna Ravana) అనే వ్యక్తి పూర్తిగా టిడిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని(Former Minister Kodali Nani) అన్నారు. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణలకు రావణ్ మద్దతుగా నిలుస్తున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ నేతలపై రావణ్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదన్నారు. టీడీపీ, జనసేన కూటమి కూడా ఆయనపై ఎలాంటి కేసులు పెట్టకపోవడం, పోలీస్ స్టేషన్ల వద్ద దాడులకు ప్రయత్నించకపోవడం చూస్తుంటే వారి మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందం స్పష్టమవుతోందని కొడాలి నాని విమర్శించారు. కానీ ఏడాదిగా పవన్ కల్యాణ్‌పై మాట్లాడడమే అతడి అరెస్టుకు కారణమని, జనసేన కక్షపూరితంగా కేసులు పెట్టిందని మాజీ మంత్రి కొడాలి ఆరోపించారు.
గతంలో రావణ్ ఎన్ని విమర్శలు చేసినా..
గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడైనా, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా... రావణ్ తమపై ఎన్ని విమర్శలు చేసినా ఎక్కడా అణిచివేసే ప్రయత్నం చేయలేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరించామని ఆయన గుర్తు చేస్తున్నారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం భిన్నమైన వ్యూహంతో వెళ్తూ తమను ప్రశ్నించే వారిపై కక్షసాధింపు చర్యలకు దిగుతోందని కొడాలి నాని ఆరోపించారు.
కొత్త చట్టాలతో భయభ్రాంతులు
ప్రభుత్వ తప్పులను, వైఫల్యాలను ఎత్తిచూపే వారిని భయభ్రాంతులకు గురిచేసేందుకు కూటమి సర్కార్ కొత్త చట్టాలను తెరపైకి తెచ్చిందని కొడాలి నాని మండిపడ్డారు. ఉప్మా, ఇడ్లీ లాంటి సాకులతో అక్రమంగా కేసులు బనాయించి జైల్లో పెడుతున్నారని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా నిలదీసే ప్రజలు, విపక్షాల నోరు నొక్కేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని కొడాలి నాని ధ్వజమెత్తారు.
మాపై దుష్ప్రచారం
రాజకీయ ప్రయోజనాల కోసం తమను "గొడ్డలి పార్టీ" అంటూ నిరంతరం దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబు నాయుడికి రోజులు దగ్గరపడ్డాయని కొడాలి నాని హెచ్చరించారు. ప్రజల హక్కులను కాలరాస్తూ, అక్రమ కేసులతో కాలం వెళ్లదీస్తున్న కూటమి ప్రభుత్వానికి భవిష్యత్తులో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని కొడాలి నాని హెచ్చరించారు.






