హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

by Batti.Sumithra |

బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఉన్న ప్రభుత్వ ఎస్.సి. బాలికల వసతి గృహంలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది.

హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
X

దిశ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఉన్న ప్రభుత్వ ఎస్.సి. బాలికల వసతి గృహంలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. బైపీసీ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అమృత అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు డొంగ్లీ మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే డీఎస్పీ బసిరెడ్డి విఠల్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. అయితే విద్యార్థి సంఘాల నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, అలాగే మృతురాలి తల్లిదండ్రులు హాస్టల్ నుంచి మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల జోక్యంతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి, అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పై సమగ్ర విచారణ జరిపి బాధ్యుల పై తగిన చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని ఆర్డీఓ రవీందర్ రెడ్డి మృతురాలి తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ఘటనకు గల కారణాల పై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story