సూపర్ స్టైలిష్ డ్రెస్‌లో అందాల విందు చేసిన ఈషా గుప్తా.. కుర్రకారును ఫిదా చేస్తున్న లుక్స్

by Pulgam srinivas |

స్టైలిష్ లుక్‌తో మతిపోగొట్టిన ఈషా గుప్తా.

సూపర్ స్టైలిష్ డ్రెస్‌లో అందాల విందు చేసిన ఈషా గుప్తా.. కుర్రకారును ఫిదా చేస్తున్న లుక్స్
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ ఈషా గుప్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1985 నవంబర్ 28న జన్మించిన ఈ అందాల భామ మోడలింగ్ రంగం నుంచి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.




2007లో మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటాన్ని సొంతం చేసుకున్న ఈషా, 2012లో విడుదలైన 'జన్నత్ 2' చిత్రంతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమైంది. అనంతరం హిందీతో పాటు తెలుగు, తమిళ చిత్రాల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.




సినిమాల్లో తన గ్లామర్‌తో ప్రేక్షకులను అలరించే ఈషా గుప్తా సోషల్ మీడియాలోనూ అదే స్థాయిలో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఎప్పటికప్పుడు స్టైలిష్ ఫోటోషూట్‌లతో నెట్టింట సందడి చేసే ఆమె, ఏ ఈవెంట్‌కు హాజరైనా తన ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటుంది.




ఆమె ధరించే అవుట్‌ఫిట్‌లు, స్టైలిష్ లుక్స్ తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా మరో ఈవెంట్‌లోనూ ఈషా గుప్తా అదిరిపోయే స్టైలిష్ డ్రెస్‌లో మెరిసింది. ఆ అవుట్‌ఫిట్‌లో ఆమె హాట్ లుక్ మరింత హైలైట్ కావడంతో కెమెరాలన్నీ ఆమెపైనే ఫోకస్ అయ్యాయి.




తన అందాలను మరింత ఎలివేట్ చేసేలా ఇచ్చిన స్టైలిష్ ఫోజులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్ల నుంచి భారీ స్పందనను అందుకుంటున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story