- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్, ఉత్తమ్‌ని ఉరితీసినా తప్పు లేదు.. మాజీ మంత్రి హరీశ్ రావు సెన్సేషనల్ కామెంట్స్
కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ భవన్‌లో ఇవాళ మాజీ మంత్రి హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో తెలంగాణలో చెరువులు నింపేందుకు అవకాశం ఉన్నా.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇవాళ నగరంలోని తెలంగాణ భవన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. వరంగల్ జిల్లాలో వర్షాలు లేక దాదాపు 90 శాతం చెరువులు ఎండిపోయాయని హరీశ్ రావు అన్నారు. అయినా మోటార్లు ఆన్ చేయకుండా.. నీళ్లను దుర్మార్గంగా దిగువకు వదులుతున్నారని కామెంట్ చేశారు. పొరుగున ఉన్న చంద్రబాబుకు గురుదక్షిణ చెళ్లించేందుకే రేవంత్ రెడ్డి నీళ్లను యథేచ్ఛగా వదులుతున్నారని సెటైర్లు వేశారు. నదులలో నీళ్లు ఉండి కూడా.. మోటార్లతో లిఫ్ చేయకపోవడం క్రిమినల్ నెగ్లిజెన్స్ కిందకు వస్తుందని.. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉరి తీసినా తప్పులేదని హరీశ్ రావు ధ్వజమెత్తారు. నీళ్ల మంత్రిగా ఉత్తమ్, ముఖ్యమంత్రిగా రేవంత్ ఇద్దరూ ఫెయిల్ అయ్యారంటూ కామెంట్ చేశారు.
రేవంత్.. అబద్ధాల్లో ‘నోబెల్ ప్రైజ్’ నీకే!
సాధారణంగా దేవాదుల మోటర్లు 71 మీటర్ల నీళ్లు ఉంటే పనిచేస్తాయని, కానీ ఇప్పుడు 75 మీటర్ల నీళ్లు ఉన్నాయని హరీశ్ రావు తెలిపారు. అంటే నీళ్లు ఉండి కూడా కావాలని ఎత్తిపోయడం లేదని.. దేవాదుల ప్రాజెక్టులో సగానికి పైగా మోటర్లు అసలు ఆన్ చేయలేదని పేర్కొన్నారు. కట్టిన ఇళ్లు.. పెట్టిన పొయ్యి లాగా కేసీఆర్ అన్న చేశారని.. అయినా చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయట్లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అబద్ధాలు చెప్పే విషయంలో రేవంత్ రెడ్డికి నోబెల్ ప్రైజ్ వస్తుందని సెటైర్లు వేశారు. సీఎం నిన్న చెప్పిన ప్రతి ఒక్క అబద్ధానికి.. ఒక్కొక్క అక్షరానికి సమాధానం చెబుతానని అన్నారు. అయినా, కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఈ ప్రభుత్వం నెగెటివ్ మైండ్ సెట్‌తో ఉందన్నారు. మేడిగడ్డ విషయంలో కుంటిసాకులు చెబుతన్నారని.. దేవాదుల నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదని హరీశ్ అన్నారు. తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకున్నట్లుగా డాక్యుమెంట్ ఉంటే రేవంత్ రెడ్డి బయటపెట్టాలని.. అలా చేస్తే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. లేనిపక్షంలో ప్రజల ముందుకు వచ్చి ఇదే రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని హరీశ్ రావు సవాల్ విసిరారు.






