- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ థియేటర్లలో పర్సంటేజ్ విధానంపై మళ్లీ చర్చ
తెలంగాణలో థియేటర్లలో పర్సంటేజ్ విధానం అమలుపై మరోసారి చర్చలు జోరందుకున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో థియేటర్లలో పర్సంటేజ్ విధానం అమలుపై మరోసారి చర్చలు వేడెక్కుతున్నట్లు తెలుస్తుంది. పెద్ది సినిమా విడుదలకు ముందు ఈ అంశంపై పెద్ద ఎత్తున వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అనంతరం మెగాస్టార్ చిరంజీవి జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. దీంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా రామ్ చరణ్ హీరోగా రూపొందిన పెద్ది సినిమా విడుదలైంది. ఇప్పుడు ఆ సినిమా విడుదలై నెల రోజులు పూర్తవడంతో మరోసారి పర్సంటేజ్ విధానంపై తెలంగాణ ఎగ్జిబిటర్ల మధ్య చర్చలు ప్రారంభమైనట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొందరు ఎగ్జిబిటర్లు మెగాస్టార్ చిరంజీవిని కలిసి తమ అభిప్రాయాలను వెల్లడించినట్లు సమాచారం.
దీనిపై స్పందించిన ఆయన వారం రోజుల సమయం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం పర్సంటేజ్ విధానం అమలును కనీసం మరో ఏడాదిన్నర పాటు వాయిదా వేయాలని యాక్టివ్ నిర్మాతలు కోరుతున్నట్లు పరిశ్రమలో చర్చ సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ఎగ్జిబిటర్లు త్వరలోనే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలా? లేక ప్రస్తుతం ఉన్న థియేటర్ల అద్దెలను పెంచాలా? అనే అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ అంశంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.






