- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాదాపూర్ రెసోనెన్స్ క్యాంపస్‌లో విద్యార్థుల ఆందోళన
మాదాపూర్ చంద్రనాయక్ తండాలోని రెసోనెన్స్ జూనియర్ కళాశాల శాతవాహన క్యాంపస్ 3లో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు.

దిశ, శేరిలింగంపల్లి: మాదాపూర్ చంద్రనాయక్ తండాలోని రెసోనెన్స్ జూనియర్ కళాశాల శాతవాహన క్యాంపస్ 3లో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. స్టూడెంట్స్ తినే అన్నంలో పురుగులు సాంబార్లో బొద్దింకలు దర్శనం ఇచ్చాయి. ఇదేందని ప్రశ్నించిన స్టూడెంట్స్ పై హాస్టల్ నిర్వాహకులు రెచ్చిపోయారు. ఇలాగే ఉంటుంది తింటే తినాలని రెసోనెన్స్ హాస్టల్ నిర్వాహకులు చెప్పడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. రెసోనెన్స్ కాలేజీ స్టాఫ్‌కు మధ్య వాగ్వివాదం జరిగింది. విద్యార్థులు క్యాంపస్ బయట గత రాత్రి ఆందోళన నిర్వహించారు.
విద్యార్థులు కాలేజీ స్టాఫ్ పరస్పర దాడికి పాల్పడ్డారు. గొడవలో కాలేజీ అద్దాలు ధ్వంసం అయ్యాయి. సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు విద్యార్థులకు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. చాలా రోజులుగా నాణ్యతలేని ఆహారాన్ని వండి పెడుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస శుభ్రత పాటించడం లేదని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు.






