- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘టాక్సిక్’ నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్.. గ్లామర్ షోతో రెచ్చిపోయిన కియారా
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ జర్నీని ప్రారంభించింది. ఇందులో భాగంగా సినిమాలోని మొదటి పాట ‘తబాహి’ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.

దిశ, సినిమా: రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టాక్సిక్’. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్. అమిత్ తివారీ కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై వెంకట్.కె నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను చిత్రబృందం పలు వాయిదాల తర్వాత ఆగస్టు 26న థియేటర్స్‌లోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగం పెంచిన చిత్రబృందం.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ జర్నీని ప్రారంభించింది. ఇందులో భాగంగా సినిమాలోని మొదటి పాట ‘తబాహి’ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.
ఈ సాంగ్ వీడియోలో యష్, కియారా అద్వానీల మధ్య ఉన్న రొమాంటిక్ సీన్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. తెరపై వీరిద్దరి కెమిస్ట్రీ అద్భుతమైన మ్యాజిక్ క్రియేట్ చేసింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ వీరి మధ్య ఉన్న లవ్ అండ్ ఇంటెన్సిటీ ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేస్తోంది. పైగా ఈ పాటలో కియారా అద్వానీ గ్లామర్ డోస్ పెంచి మరింత అందంగా కనిపించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ,హిందీ భాషల్లో విడుదలైన ఈ లవ్ ట్రాక్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఈ పాటను కియారా అద్వానీ తన ఎక్స్ ద్వారా షేర్ చేస్తూ.. తప్పు-ఒప్పుల భావనలకు ఆవల ఒక మైదానం ఉంది, నేను నిన్ను అక్కడ కలుస్తాను అంటూ ఒక అందమైన క్యాప్షన్ పెట్టారు. ఇక ఈ క్రేజీ సాంగ్ తెలుగు వెర్షన్‌కు ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్, తనిష్క్ బాగ్చి, ఫహీమ్ అబ్దుల్లా కలిసి సంగీతాన్నిఅందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ‘తబాహి’ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.






