- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరుస ఫ్లాపులున్నా తగ్గని క్రేజ్.. నాలుగు భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా మారిన నిధి అగర్వాల్
ఈనేపథ్యంలో.. మీడియాతో మాట్లాడిన నిధి అగర్వాల్ తన రాబోయే సినిమాల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్‌కు ఈ మధ్య కాలంలో అదృష్టం కలిసి రావడం లేదు. పెద్ద పెద్ద ప్రాజెక్టులలో నటించే అవకాశాలు వచ్చినప్పటికీ, ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాయి. స్టార్ హీరోల సరసన స్క్రీన్ షేర్ చేసుకున్నప్పటికీ, ఈ అందాల భామకు సరైన హిట్ మాత్రం పడటం లేదు. ఇటీవల ఆమె ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన ‘హరి హర వీరమల్లు’, ‘ది రాజా సాబ్’ వంటి భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి. ఎంతో కష్టపడినప్పటికీ అదృష్టం కలిసిరాకపోవడంతో హిట్ అందుకోలేకపోయారు. అయినప్పటికీ అమ్మడు ఏమాత్రం నిరాశ చెందకుండా. ముందుకు సాగుతున్నారు. అయితే వరుస ఫ్లాపులు పడుతున్నా నిధి అగర్వాల్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం. నిర్మాతలు, దర్శకులు ఇప్పటికీ ఆమెకు క్రేజీ ఆఫర్లు ఇస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో నిధి అగర్వాల్ ప్రస్తుతం ఏకకాలంలో నాలుగు భారీ చిత్రాలు చేస్తున్నట్లు స్వయంగా వెల్లడించారు.
జూలై 8న ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిధి స్వామివారి వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈనేపథ్యంలో.. మీడియాతో మాట్లాడిన నిధి అగర్వాల్ తన రాబోయే సినిమాల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తాను ప్రస్తుతం హిందీ లో రెండు క్రేజీ సినిమాలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ సంవత్సరంలోనే తెలుగులో కూడా రెండు పెద్ద ప్రాజెక్టులు ప్రారంభం కాబోతున్నట్లు వెల్లడించారు. ఇలా వరుసగా నాలుగు చిత్రాలు లైన్‌లో ఉన్నాయని చెప్పారు. కెరీర్‌లో వరుస ఎదురుదెబ్బలు తగిలినా.. పట్టు వదలకుండా ఏకంగా నాలుగు భారీ చిత్రాలతో బాలీవుడ్, టాలీవుడ్‌లలో బిజీగా మారిన నిధి అగర్వాల్, ఈ కొత్త ప్రాజెక్టులతోనైనా ఒక బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవాలని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.






