- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'లెనిన్' ప్రీమియర్స్ కన్ఫర్మ్.. కానీ అభిమానులకు పెద్ద షాక్
'లెనిన్' ప్రీమియర్ షోలు నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ అవి చాలా తక్కువ థియేటర్లలో మాత్రమే ప్రదర్శించనున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం 'లెనిన్'. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, అక్కినేని నాగార్జున సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించారు. శివాజీ, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూలై 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో జూలై 9వ తేదీ రాత్రి ప్రీమియర్ షోలను ప్రదర్శించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ప్రీమియర్ షోలను చాలా పరిమిత సంఖ్యలో థియేటర్లలో మాత్రమే నిర్వహించాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఈ షోల టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచే ఆలోచన కూడా లేదని సమాచారం. పరిమిత సంఖ్యలో ప్రీమియర్ షోలు వేస్తే అవి ప్రధానంగా మూవీ యూనిట్ సభ్యులు, సినీ ప్రముఖులకే పరిమితమయ్యే అవకాశం ఉందని, సాధారణ ప్రేక్షకులు, అభిమానులకు టికెట్లు దొరకడం కష్టమేనని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్రీమియర్ షోలో సినిమా చూడాలనుకున్న అభిమానుల కోరిక నెరవేరే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రంపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.






