- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెండితెరపైకి సౌరవ్ గంగూలీ బయోపిక్.. ‘దాదా’ నుంచి డబుల్ అప్డేట్స్ ఇచ్చిన మేకర్స్
నేడు గంగూలీ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా ఇండస్ట్రీలో బయోపిక్ ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొంతమంది ప్రముఖుల జీవితాల ఆధారంగా వెండితెరపైకి వచ్చిన చిత్రాలెన్నో బాక్సాఫీసు వద్ద ఘన విజయాలను సాధించాయి. ఇక ఇప్పుడు భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన, అగ్రెసివ్ కెప్టెన్లలో ఒకరైన ‘దాదా’ సౌరవ్ గంగూలీ బయోపిక్ రాబోతోంది. నేడు గంగూలీ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ రాజ్‌కుమార్ రావ్, సౌరవ్ గంగూలీ పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. క్రికెట్ హిస్టరీలోనే ఒక ఐకానిక్ మూమెంట్ అయిన లార్డ్స్ బాల్కనీలో జెర్సీ విప్పి గాల్లో ఊపిన చారిత్రాత్మక సంఘటనను ఈ పోస్టర్‌లో అద్భుతంగా రీ-క్రియేట్ చేశారు మూవీ మేకర్స్.
ఈ పోస్టర్ చూస్తుంటేనే సినిమా ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో అర్థమవుతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహిస్తుండగా.. లవ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై లవ్ రంజన్, అంకుర్ గార్గ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి-సిరీస్, డిబిఎల్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి. అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది మే 14, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో గంగూలీ కోల్‌కతా వీధుల నుంచి లార్డ్స్ మైదానం వరకు ఎదిగిన తీరును, ఆ తర్వాత కెప్టెన్‌గా ఇండియన్ క్రికెట్‌ను ఎలా మలుపు తిప్పారనే ఆసక్తికరమైన విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నట్లు తెలుస్తోంది.






