అమ్మ పేరుతో ఓ మొక్కను నాటండి: డీఈవో సిద్ధార్థ రెడ్డి

by Jakkula.Mamatha |

పర్యావరణ పరిరక్షణకు భావోద్వేగ స్పర్శను జోడిస్తూ విద్యాశాఖ ఆధ్వర్యంలో అమ్మ పేరుతో ఓ మొక్క అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.సిద్ధార్థ రెడ్డి అన్నారు.

అమ్మ పేరుతో ఓ మొక్కను నాటండి: డీఈవో సిద్ధార్థ రెడ్డి
X

దిశ,ములుగు జిల్లా ప్రతినిధి: పర్యావరణ పరిరక్షణకు భావోద్వేగ స్పర్శను జోడిస్తూ విద్యాశాఖ ఆధ్వర్యంలో అమ్మ పేరుతో ఓ మొక్క అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.సిద్ధార్థ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఉపాధ్యాయుడు, విద్యార్థి తమ తల్లి జ్ఞాపకార్థం ఒక మొక్క నాటడం ద్వారా ప్రకృతికి సేవ చేయాలని, ప్రతి పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి పరిరక్షణ కావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, మొక్కలు నాటిన ప్రతి ఒక్కరు వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను Eco Club for Mission LiFE పోర్టల్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరు ప్రకృతిపై ప్రేమ, కృతజ్ఞత, పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా నిలపాలని ఆయన కోరారు.

Next Story