అధికారిక లాంఛనాలతో మాజీ ఎమ్మెల్యే అంత్యక్రియలు.. ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-08 05:50:49  IST  )

భువనగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసింది.

అధికారిక లాంఛనాలతో మాజీ ఎమ్మెల్యే అంత్యక్రియలు.. ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భువనగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా సేవలందించిన కొమ్మిడి నరసింహారెడ్డి (Kommidi Narsimha Reddy) మంగళవారం హైదరాబాద్‌లో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల తెలంగాణ ప్రభుత్వం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. కొమ్మిడి నరసింహారెడ్డి మృతికి సంతాపంగా ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో (Police Honours) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు (CS Sanjay Jaju) ఆదేశాల మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ బుధవారం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. అయితే, కొమ్మిడి నర్మింహారెడ్డి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీకి సీఎస్ ఆదేశాలను జారీ చేశారు.

Next Story