Gold Price: మళ్లీ కుప్పకూలిన గోల్డ్ రేట్లు.. వరుసగా నాలుగో రోజు తగ్గిన ధరలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-08 04:41:53  IST  )

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వరుసగా నాలుగో రోజు బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి.

Gold Price: మళ్లీ కుప్పకూలిన గోల్డ్ రేట్లు.. వరుసగా నాలుగో రోజు తగ్గిన ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: బంగారం (Gold), వెండి (Silver) కొనుగోలు చేయాలనుకునే పేద, మధ్య తరగతి ప్రజలకు సువర్ణాకాశం రానే వచ్చింది. తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు వరుసగా నాలుగో రోజు కూడా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ (International Market) ప్రభావంతో దేశీయంగానూ బంగారం, వెండి ధరలు భారీగా కిందకు దిగివచ్చాయి. ఇవాళ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.770 మేర తగ్గి రూ.1,44,490కి చేరింది. అదేవిధంగా ఆభరణాల తయారిలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 పతనమై రూ.1,32,450 పలుకుతోంది.

ఏకంగా రూ.5,000 పతనమైన వెండి

ఇక బంగారంతో పాటే వెండి (Silver) ధర కూడా కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చేలా పడిపోయాయి. ఇవాళ మార్కెట్‌లో కేజీ వెండి ధర ఏకంగా రూ.5 వేల తగ్గి రూ.2,45,000కి చేరింది. వరుస రోజుల్లో ధరలు దిగిరావడంతో మార్కెట్లలో కొనుగోళ్ల సందడి పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే, రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాలు, షోరూమ్‌లను బట్టి బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయి.

Next Story