- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహేష్ బాబు మమ్మల్ని మోసం చేశాడు.. అలా చేయడం వల్ల బతికిపోయామంటూ శిల్పా శిరోద్కర్ కామెంట్స్
మహేష్ బాబు, నమ్రత పెళ్లైన కొత్తలో ఆయనకు మరాఠీ భాష రాదని తాము భావించినట్లు తెలిపారు.

దిశ, సినిమా: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘వారణాసి’ షూటింగ్‌లో ఫుల్ బిజీ అయిపోయారు. ఇందులో మహేష్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్స్‌లోకి రాబోతోంది. మహేష్ బాబు షూటింగ్స్ నుంచి కొంచెం ఖాళీ సమయం దొరికినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటంతో పాటు, కుటుంబంతో కలిసి సరదాగా గడపడానికి ఇష్టపడతారు. ఇదిలా ఉంటే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ బాబు మరదలు, మాజీ నటి శిల్పా శిరోద్కర్ తన బావ గురించి ఒక భలే ఆసక్తికరమైన, సరదా విషయాన్ని పంచుకున్నారు. మహేష్ బాబు, నమ్రతలకు పెళ్లయిన కొత్తలో జరిగిన ఒక సంఘటనను శిల్పా గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో మహేష్ బాబుకు మరాఠీ భాష అస్సలు రాదని తామంతా గట్టిగా నమ్మామన్నారు.
దీంతో ఇంట్లో కుటుంబానికి సంబంధించిన ఏవైనా వ్యక్తిగత విషయాలు, సీక్రెట్స్ మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు.. మహేష్ ముందే తామంతా మరాఠీ భాషలో మాట్లాడుకునేవాళ్లమని చెప్పారు. శిల్పా శిరోద్కర్ మాట్లాడుతూ.. “ఆయనకు ఎలాగూ అర్థం కాదు కదా అనే ధీమాతో నేను, నమ్రత ఎన్నో వ్యక్తిగత విషయాలను ఆయన ముందే మరాఠీలో చర్చించుకునేవాళ్లం. మేము మాట్లాడుకుంటున్నంత సేపు మహేష్ ఏమీ తెలియనట్లు ఎంతో ప్రశాంతంగా, అమాయకంగా వింటూ కూర్చునేవారు. కానీ, కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు ఎప్పటిలాగే మేమిద్దరం మరాఠీలో మాట్లాడుకుంటుండగా.. మహేష్ బాబు ఒక్కసారిగా మమ్మల్ని ఆశ్చర్యపరుస్తూ అదే భాషలో స్పందించారు. దాంతో మేము ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాం. అంతవరకు తనకు మరాఠీ వచ్చనే విషయాన్ని దాచిపెట్టి, మా సీక్రెట్స్ అన్నీ వింటూ మహేష్ మమ్మల్ని నమ్మించి మోసం చేశారు. అయితే అదృష్టవశాత్తూ మహేష్ బాబు గురించి ఎలాంటి నెగెటివ్ విషయాలు మేము మాట్లాడుకోలేదు. లేదంటే ఆ తర్వాత ఆయన మమ్మల్ని దారుణంగా ఆటపట్టించేవారు.. అలా చేయకుండా బతికిపోయాం” అని చెప్పుకొచ్చారు.






