స్టార్ హీరోల జాతకాలు చెప్పి బిగ్ ట్విస్ట్ ఇచ్చిన వేణు స్వామి.. ఎన్టీఆర్‌ సీఎం అవుతాడంటూ సంచలన వ్యాఖ్యలు

by Mallepaka Hamsa |

అలాగే నటి సమంతను ఒక ఫైటర్ అని ప్రశంసించారు. మెగాస్టార్ చిరంజీవి ఎంతో కష్టపడి పైకి వచ్చారని తెలిపారు.

స్టార్ హీరోల జాతకాలు చెప్పి బిగ్ ట్విస్ట్ ఇచ్చిన వేణు స్వామి.. ఎన్టీఆర్‌ సీఎం అవుతాడంటూ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సెలబ్రిటీల, రాజకీయ నాయకుల జాతకాలు చెప్పి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల వ్యక్తగత జీవితానికి సంబంధించిన విషయాలు మందే ఊహించి చెప్పి వివాదాల్లో చిక్కుకున్నాడు. ఇటీవల నాగచైతన్య, శోభితల గురించి చెప్పి చిక్కుల్లో పడిన ఆయన ఇకపై సెలబ్రిటీల జాతకాలు చెప్పనని శపదం చేశాడు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి టాలీవుడ్ స్టార్ హీరోల గురించి, వారి వ్యక్తిత్వాల గురించి ఒక్కో ముక్కలో చెబుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ నుంచి రాజమౌళి వరకు అందరినీ పొగడ్తలతో ముంచెత్తడం విశేషం. ఈ ఇంటర్వ్యూలో ఆయన టాలీవుడ్ టాప్ స్టార్లను ఒక్కో ముక్కలో అభివర్ణించారు. విజయ్ దేవరకొండను ఎంతో కష్టపడే వ్యక్తి అని చెప్పిన ఆయన, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను ఒక కారణజన్ముడు అని అన్నారు. అలాగే నటి సమంతను ఒక ఫైటర్ అని ప్రశంసించారు. మెగాస్టార్ చిరంజీవి ఎంతో కష్టపడి పైకి వచ్చారని తెలిపారు.

ఆయన కుమారుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కేవలం తన వంశాన్ని మాత్రమే నమ్ముకోకుండా, సొంత కష్టాన్ని నమ్ముకుని ఈ స్థాయికి చేరారని మెచ్చుకున్నారు. ఇక టాలీవుడ్ జక్కన్న ఎస్.ఎస్. రాజమౌళిని కూడా కారణజన్ముడిగా అభివర్ణించగా, సూపర్ స్టార్ మహేష్ బాబును అందగాడు అని చెప్పారు. అయితే వీరందరికంటే ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ కేవలం ఒక మంచి నటుడు మాత్రమే కాదని, ఆయనలో అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని వేణు స్వామి చెప్పారు. భవిష్యత్తులో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయంటూ పెద్ద బాంబు పేల్చారు. అలాగే జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ఆయన డిప్యూటీ సీఎంగా తన బాధ్యతలను ఎంతో చక్కగా నెరవేరుస్తున్నారని, ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఒక పర్ఫెక్ట్ పొలిటీషియన్ అని ప్రశంసించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Next Story