- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'పతి పత్నీ ఔర్ వో దో' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడ చూడొచ్చంటే?
'పతి పత్నీ ఔర్ వో దో' జూలై 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

దిశ, వెబ్ డెస్క్: 2019లో విడుదలై మంచి ఆదరణ పొందిన 'పతి పత్నీ ఔర్ వో' చిత్రానికి కొనసాగింపుగా 'పతి పత్నీ ఔర్ వో దో' రూపొందింది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించగా, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, వామికా గబ్బి హీరోయిన్లుగా కనిపించారు. ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, రేణు రవి చోప్రా నిర్మించారు. కొంతకాలం క్రితం మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం మరికొన్ని రోజుల్లో ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమాను జూలై 10వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ఓటీటీ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.






