- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అర్ధరాత్రి ఆందోళన
మహాత్మా గాంధీ యూనివర్సిటీలో బాలికల హాస్టల్ విద్యార్థినిలు మంగళవారం అర్ధరాత్రి ఆందోళనకు దిగారు.

దిశ, నార్కట్ పల్లి: మహాత్మా గాంధీ యూనివర్సిటీలో బాలికల హాస్టల్ విద్యార్థినిలు మంగళవారం అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. తాగునీరు, మెస్ నిర్వహణలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని 5 గంటలపాటు వీసీ గెస్ట్ హౌస్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినిలు మాట్లాడుతూ.. గత కొంతకాలంగా తీవ్రమైన నీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టళ్లకు సరఫరా కావలసిన నీటిని నూతన భవనాలకు మళ్లించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు. దీంతో హాస్టల్ విద్యార్థినిలు రోజువారీ అవసరాలైన నీటికి ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.
నీటి సమస్య తీవ్ర రూపం దాల్చడంతో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో గెస్ట్ హౌస్ ఎదుట ఆందోళన చేపట్టాల్సిన అవసరం వచ్చింది అన్నారు. తాగునీరు, వినియోగ నీరు అందించాలని కోరుతూ నినాదాలు చేశారు. వైస్ ఛాన్స్‌లర్ , రిజిస్టర్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లినప్పటికీ సంబంధిత కేర్ టేకర్లు , వార్డెన్లు తక్షణ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. నీటి సమస్య వల్ల విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, విద్యాభ్యాసం పై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. వెంటనే ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి హాస్టల్ పరిస్థితి పరిశీలించాలని కోరారు. శాశ్వత పరిష్కారం చూపించకుండా నిర్లక్ష్యం వహిస్తే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.






