- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెట్టును ఢీకొట్టిన ఇసుక ట్రాక్టర్.. రెండుగా విడిపోయిన ఇంజిన్ భాగాలు
by Jakkula.Mamatha |
మహబూబాబాద్ మండలం కేవులతండా సమీపంలో ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ నిన్న సాయంత్రం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.

X
దిశ,మహబూబాబాద్ ప్రతినిధి: మహబూబాబాద్ మండలం కేవులతండా సమీపంలో ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ నిన్న సాయంత్రం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ట్రాక్టర్ ఇంజిన్ భాగం రెండుగా విడిపోగా, డ్రైవర్ గాయాలతో బయటపడ్డారు. చిన్నగూడూరు ప్రాంతం నుంచి మహబూబాబాద్ పట్టణానికి ఇసుకను అతివేగంగా తరలిస్తున్న ట్రాక్టర్ల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్రమ ఇసుక రవాణాపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రాణనష్టం జరగకముందే నియంత్రించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఇసుక కుప్పలు దర్శనమిస్తున్న రెవెన్యూ అధికారులు పట్టింపు కరువైందని స్థానికులు మండిపడుతున్నారు.
Next Story






