- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal)లో కలకలం రేపిన 11 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ దారుణానికి ఒడిగట్టిన ప్రధాన నిందితుడు ప్రవాష్ మోండల్ (Pravash Mondal) పోలీసు ఎన్‌కౌంటర్‌లో ఇవాళ మరణించాడు. కోల్‌కతా శివారు ప్రాంతమైన బరుఇపూర్‌లో అర్ధరాత్రి దాటాక ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు ప్రవాష్ మోండల్‌ను క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం అర్ధరాత్రి సమయంలో పోలీసులు నేరం జరిగిన ప్రాంతానికి తీసుకువెళ్లారు. ఆ సమయంలో నిందితుడు హఠాత్తుగా పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అంతటితో ఆగకుండా పోలీసుల వద్ద ఉన్న తుపాకీని లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించడంతో, ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం. ఈ దారుణ అత్యాచార, హత్య ఉదంతం బెంగాల్ వ్యాప్తంగా పొలిటికల్ టర్న్ తీసుకున్న నేపథ్యంలో నిందితుడి ఎన్‌కౌంటర్‌లో హతం కావడం హాట్ టాపిక్‌గా మారింది.






