స్కూల్ బస్సు లారీ ఢీ

by Jakkula.Mamatha |

మహబూబాబాద్ జిల్లా కురవి–ఖమ్మం ప్రధాన రహదారిపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురి చేసింది.

స్కూల్ బస్సు లారీ ఢీ
X

దిశ,కురవి: మహబూబాబాద్ జిల్లా కురవి–ఖమ్మం ప్రధాన రహదారిపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురి చేసింది. కురవి సమీపంలోని మోదుగులగూడెం మూలమలుపు వద్ద నాగార్జున విద్యాలయానికి చెందిన స్కూల్ బస్సు అతివేగంగా వచ్చి ముందున్న లారీని ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన సమగ్ర సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story