ఎర్దండిలో విషాదం.. మొన్న అదృశ్యం, నేడు మృతదేహం లభ్యం

by Jakkula.Mamatha |

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామంలోని పలు దేవాలయాల్లో పూజారిగా పనిచేస్తున్న కులకర్ణి ప్రణవ్ నరహరి అనే పూజారి ఆదివారం సాయంత్రం అదృశ్యమయ్యాడు.

ఎర్దండిలో విషాదం.. మొన్న అదృశ్యం, నేడు మృతదేహం లభ్యం
X

దిశ, ఇబ్రహీంపట్నం: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామంలోని పలు దేవాలయాల్లో పూజారిగా పనిచేస్తున్న కులకర్ణి ప్రణవ్ నరహరి అనే పూజారి ఆదివారం సాయంత్రం అదృశ్యమయ్యాడు. అదే రోజు తండ్రి దత్తాత్రేయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు గత నాలుగు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, నేడు(బుధవారం) గ్రామ పూజారి కోసం మేమంతా ఏకమైతమంటూ వెళ్లి పూజారి జాడ కోసం గ్రామ శివారు, పొలిమేరలో, గోదావరి నది వైపు వెతుకుతున్న క్రమంలో ప్రణవ్ నరహరి శవమై తేలాడు. మృతుడు ప్రణవ్ నరహరి సొంత గ్రామం మెదక్ జిల్లా నివాసి కాగా ఎర్దండి లోని అమ్మమ్మ దగ్గర ఉంటూ అదే గోదావరి నది తీరాన కొలువై ఉన్న గంగా మాత ఆలయం, శ్రీ రాములవారి దేవాలయాల్లో పూజలు చేస్తుంటాడు. చాలా చిన్న వయసులోనే పూజలు చేస్తు గ్రామస్తులతో చురుగ్గా ఉండే పూజారి గోదావరిలో శవమై తేలడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story