'మారెమ్మ' విడుదలపై మేకర్స్ కీలక నిర్ణయం

by Pulgam srinivas |

'మారెమ్మ' చిత్రం చివరి నిమిషంలో విడుదల వాయిదా పడినట్లు సమాచారం.

మారెమ్మ విడుదలపై మేకర్స్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ భూపతిరాజు 'మారెమ్మ' చిత్రంతో వెండితెరకు హీరోగా పరిచయం కానున్నాడు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సస్పెన్స్, డివోషనల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో దీపా బాలు హీరోయిన్‌గా నటిస్తుండగా, వినోద్ కుమార్, రూప్ లక్ష్మి, దయానంద్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. మంచాల నాగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్నారు. ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందిస్తుండగా, అంకిరెడ్డి ప్రశాంత్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 19వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ తొలుత ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో సినిమా విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కొత్త విడుదల తేదీని మరికొన్ని రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story