- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకే రన్‌వేపైకి ఎదురెదురుగా విమానాలు.. తప్పిన ఘోర ప్రమాదం
ముంబయి ఎయిర్ పోర్టులో పెను ప్రమాదం తప్పింది. చివరి నిమిషంలో ఏటీసీ అప్రమత్తతో ప్రమాదం తప్పింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళన కలిగిస్తున్నాయి. గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుతామా లేదా అనేది తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ముంబయి ఎయిర్ పోర్ట్ లో ఘోర ప్రమాదం తప్పింది. ఒకే రన్‍వే పైకి ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానాలు ఎదురెదురుగా రావడం కలకలం రేపింది. ఓ రన్ వే పై ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం ల్యాండ్ కాగా అదే సమయంలో అదే రన్ వే నుంచి టెకాఫ్ అవ్వడానికి ఎయిర్ ఇండియా విమానం ఎదురుగా వచ్చింది. గమనించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) ఎయిర్ ఇండియా విమాన పైలట్‌ను అప్రమత్తం చేయడంతో అతడు విమానాన్ని నిలిపివేశాడు.
అడుగు దూరంలో తప్పిన ప్రమాదం:
మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. రెండు విమానాలు అడుగుల దూరంలో ఎదురెదురుగా ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీకి వెళ్తుండగా, సిలిగురి నుండి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం వచ్చింది. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ATC ఆదేశాల మేరకు టేకాఫ్ ప్రక్రియను నిలిపివేసినట్లు స్పష్టం చేసింది. ఈ ఘటనలో ప్రయాణికులకు గానీ, విమానాలకు గానీ ఎలాంటి నష్టం వాటిల్లలేదు. అయితే ఒకే సమయంలో రెండు విమానాలు ఒకే రన్‌వేపైకి రావడానికి దారితీసిన పరిస్థితులపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు.






