- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIRAL: కొల్లాపూర్‌లో కలకలం.. ప్రిన్సిపాల్ మర్మాంగాన్ని కొరికిన విద్యార్థి
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లోని ఓ కళాశాలలో దారుణం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: సభ్యసమాజం తలదించుకునే ఘటన నాగర్‌కర్నూల్ (Nagar Kurnool) జిల్లా కొల్లాపూర్ (Kollapur)లోని ఓ కళాశాలలో వెలుగులోకి వచ్చింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన తండ్రి రూపంలో ఉన్న ప్రిన్సిపాలే కామపిశాచిగా మారి ఓ విద్యార్థిపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. అయితే, ఆ మృగాడి బారి నుంచి తప్పించుకునేందుకు సదరు విద్యార్థి సాహసోపేతంగా పోరాడి, ప్రిన్సిపాల్ మర్మాంగాన్ని బలంగా కొరికి తప్పించుకున్నాడు. బాధితుడి కథనం ప్రకారం.. అర్ధరాత్రి వేళ కొల్లాపూర్‌లోని ఓ కళాశాల ప్రిన్సిపాల్, సదరు విద్యార్థిపై అనుచితంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడికి యత్నించాడు. ఊహించని ఈ ప్రమాదం నుంచి ఎలాగైనా బయటపడాలని భావించిన ఆ విద్యార్థి.. తనను లొంగదీసుకునేందుకు ప్రయత్నించిన ప్రిన్సిపాల్ మర్మాంగాన్ని గట్టిగా కొరికాడు. దాంతో తీవ్ర నొప్పితో అతడు విలవిలలాడగా, ఆ గ్యాప్‌లో బాధిత విద్యార్థి అక్కడ నుంచి తప్పించుకుని ప్రాణాలను కాపాడుకున్నాడు.
సర్టిఫికెట్లు కాలేజీలో ఉండటంతో భయపడ్డా..
అయితే, ఈ దారుణ ఘటనపై బాధిత విద్యార్థి ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాడు సదరు ప్రిన్సిపాల్ తనపై ఇలా అనుచితంగా ప్రవర్తించడం ఇది రెండోసారి అని బాధితుడు కన్నీరు పెట్టాడు. తన ఒరిజినల్ సర్టిఫికెట్లు అన్నీ కాలేజీలోనే ఉండటంతో, ఎక్కడ తన ఫ్యూచర్ పాడవుతుదనే భయంతో గతంలో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేకపోయానని బాధితుడు ఆవేదన వ్యక్తం చేసింది. విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు.






