నాగన్‌పల్లిలో విషాదం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

by Jakkula.Mamatha |

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

నాగన్‌పల్లిలో విషాదం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
X

దిశ, ఇబ్రహీంపట్నం: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లి గ్రామంలో వడ్డెర రంగయ్య(48) భార్య, పిల్లలతో కలిసి గుడిసెలో నివసిస్తున్నాడు. కాగా మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కురిసిన వర్షానికి విద్యుత్ వైర్లు తెగి నిలిచి ఉన్న నీళ్లలో పడటం వలన, అది గమనించని వడ్డెర రంగయ్య తన గుడిసెలో నుండి బయటకు వెళ్ళగా నీళ్లలో తడిసిన వైర్లు షాక్‌కు గురయ్యాడు. ఈ ఘటనను స్థానికులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించే లోపు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో నాగన్‌పల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సింది.

Next Story