- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వానోస్తే నీరంతా ఇంట్లోనే..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండల కేంద్రంలో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్లపైకి భారీగా నీరు చేరింది.

దిశ, పలిమెల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండల కేంద్రంలో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్లపైకి నీరుతో చెత్తా, ఇసుక, బురద పేరుకుపోయి గ్రామాల్లోని వార్డులలో ప్రజలు మరియు వాహనదారులు రోడ్డు పైన పేరుకుపోయిన బురదతో బయటకు వెళ్లాలంటే, రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి భారీ వర్షం కురవడంతో కుమ్మరి లచ్చయ్యకు చెందిన ఇంట్లోకి వాన నీరు వచ్చింది. ఊర్లోని వర్షపు నీరంతా కాలువలుగా వచ్చి ముందుకు పోవడానికి వీలు లేకపోవడంతో సమీపంలోని లచ్చయ్య ఇంటి చుట్టూ వరదగా వచ్చి ఇంట్లోకి చేరాయి.
ఇంటి చుట్టూ నీరు చెరువును తలపిస్తున్నాయి . ఈ సమస్య ను అధికారులు స్పందించాలని అలాగే గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవాలని, వాన వచ్చినప్పుడల్లా.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఇల్లు సగానికి పైగా పడిపోయింది. ఉన్నదాంట్లోనే మేము నివాసముంటున్నాం. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి ఇంటి చుట్టూ నీళ్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో రాత్రంతా ఆ కుటుంబం నీళ్లలోనే ఉంటూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించాలని, కోరుతున్నారు.






