కాజీపేట రైల్వే డివిజ‌న్ సాధించే వ‌ర‌కు పోరాడుతాం: మాజీ ఎమ్మెల్యే దాస్యం విన‌య్ భాస్క‌ర్

by Jakkula.Mamatha |

బీఆర్ఎస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఈ నెల 30వ తేదీన ఢిల్లీలో జంత‌ర్‌మంత‌ర్ ధ‌ర్నా కోసం త‌ర‌లి వెళ్తున్న పార్టీ శ్రేణుల‌కు ప్ర‌భుత్వ మాజీ చీఫ్ విప్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం విన‌య్ భాస్క‌ర్ కాజీపేట స్టేష‌న్ వెళ్లి సంఘీభావం తెలిపారు.

కాజీపేట రైల్వే డివిజ‌న్ సాధించే వ‌ర‌కు పోరాడుతాం: మాజీ ఎమ్మెల్యే దాస్యం విన‌య్ భాస్క‌ర్
X

దిశ, హన్మకొండ టౌన్: బీఆర్ఎస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఈ నెల 30వ తేదీన ఢిల్లీలో జంత‌ర్‌మంత‌ర్ ధ‌ర్నా కోసం త‌ర‌లి వెళ్తున్న పార్టీ శ్రేణుల‌కు ప్ర‌భుత్వ మాజీ చీఫ్ విప్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం విన‌య్ భాస్క‌ర్ కాజీపేట స్టేష‌న్ వెళ్లి సంఘీభావం తెలిపారు. ఈ సంద‌ర్భంగా దాస్యం విన‌య్ భాస్క‌ర్ మాట్లాడుతూ.. పోరాటాలు మా పంథా అని, హ‌క్కుల సాధ‌న కోసం నిరంత‌రం ఉద్య‌మిస్తామ‌ని అన్నారు. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం పోరాడిన విధంగా తెలంగాణ రాష్ట్ర హ‌క్కుల సాధ‌న‌కు ఉద్య‌మం చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. భార‌త రాష్ట్ర స‌మితి పార్టీగా మేము ఈ ప్రాంత ప్ర‌జ‌ల అభీష్టం మేర‌కు ప‌ని చేస్తున్నామ‌ని అన్నారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ప్ర‌జ‌ల 40 ఏండ్ల కోచ్ ఫ్యాక్ట‌రీ క‌ల‌ను సాక‌రం చేసేందుకు పోరాడామ‌ని గుర్తు చేశారు.

సాధించిన కోచ్ ఫ్యాక్ట‌రీలో స్థానికుల‌కే ఉద్యోగాలు ఇవ్వాల‌ని, కాజీపేట రైల్వే డివిజ‌న్ సాధన‌, భూమి ఇచ్చిన భూ బాధితుల‌కు ఉద్యోగ అవ‌కాశాలు, లోకో పైలెట్లు, రైల్వే పెండింగ్ ప్రాజెక్టుల సాధ‌న కోసం వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌వ‌ర్గ పార్టీ శ్రేణులతో క‌లిసి ఈ నెల 30న ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద శాంతియుత ధ‌ర్నా నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ కార్పొరేట‌ర్లు న‌ర్సింగ‌రావు, అశోక్ యాద‌వ్‌, ర‌మేష్‌, సీనియ‌ర్ నాయ‌కులు ర‌మేష్, ఐన‌వోలు స‌ర్పంచ్ ర‌ఘువంశీ, జిల్లా నాయ‌కులు పులి ర‌జినీకాంత్‌, పులి విక్ర‌మ్‌, క‌న‌క‌రాజు, శంక‌ర్‌, శ్రీ‌నివాస్‌, అశోక్‌, సుధాక‌ర్‌, అఫ్జ‌ల్‌, పున్నం చంద‌ర్ , బ‌రిగెల విన‌య్‌, కిట్టు, న‌యీం జుబేర్‌, ల‌డ్డు, గ‌ణేష్‌, రాబ‌ర్ట్‌, స‌దానందం, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Next Story