Beer: అస్సలు బీర్‌‌కు, పొట్టకు మధ్య సంబంధమేంటి.. నిపుణులు ఏం చెబుతున్నారు?

by Kodari Anjali |

ప్రస్తుత రోజుల్లో ఏజ్‌తో సంబంధం లేకుండా చాలా మంది బీర్(Beer) తాగుతున్నారు.

Beer: అస్సలు బీర్‌‌కు, పొట్టకు మధ్య సంబంధమేంటి.. నిపుణులు ఏం చెబుతున్నారు?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో ఏజ్‌తో సంబంధం లేకుండా చాలా మంది బీర్(Beer) తాగుతున్నారు. ఆల్కహాల్ (Alcohol) ప్రియుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఏ పార్టీ, ఫంక్షన్, ఇంట్లో కార్యక్రమాలు, ఫ్రెండ్స్ కలిసినా, సంతోషం వచ్చినా, బాధొచ్చినా చాలా మంది బీర్ తాగుతుంటారు. అయితే బీర్ అండ్ పొట్టకు మధ్య సంబంధం ఏంటని తాజాగా నిపుణులు క్లారిటీ ఇచ్చారు. అయితే బీర్ తాగినాక బీర్‌లోని ఆల్కహాల్ బ్లడ్‌లోకి పోతుందట. దీన్ని మిగిలిన పేగులు పీల్చుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.

అలాగే రక్తం ద్వారా ఆల్కహాల్ లివర్‌కు చేరుకుని విచ్ఛిన్నమవుతుంది. ఈ క్రమంలో అసిటాల్టిహైడ్ అండ్ అసిటేట్ అనే వ్యర్థ పదార్థాలు ఏర్పడి.. కొవ్వును కరగడాన్ని అడ్డుకుంటాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. కొవ్వు కరగకపోవడమే కాకుండా.. కొవ్వు పేరుకుపోతుందట. దీంతో పొట్ట పెరగడానికి బీర్ కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.అలాగే బీర్‌లో కేలరీలు అధికంగా ఉంటాయి. ఈ కేలరీలు కొవ్వుగా ఛేంజ్ అయి.. పొట్ట వచ్చేందుకు దారితీస్తుంది.

వాస్తవానికి బీర్ తాగితే ఎక్కువగా ఆకలి అవుతుంది. కాగా వారికి తెలియకుండానే ఫుడ్ ఎక్కువగా తీసుకుంటుంటారు. ఇదో కారణమని చెప్పొచ్చు. ఎందుంటే.. ముందుగా శరీరం ఆల్కహాల్‌ను కరిగించడానికే ప్రిపరెన్స్ ఇస్తుంది. తర్వాతనే మిగతా ఫుడ్స్‌ను జీర్ణం చేస్తుంది. ముఖ్యంగా బీర్ తాగినాక ఆయిల్ ఎక్కువ ఉన్న ఫుడ్స్, అధిక కార్బోహైడ్రేట్ ఉన్న ఆహారం తీసుకోకూడదు. పొట్ట పెరగడానికి ముఖ్య కారణమవుతుందని నిపుణులు అంటున్నారు.

కాగా బీర్ తాగినాక పొట్ట రాకుండా ఉండాలంటే.. బీర్ తాగే క్రమంలో ఆయిల్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా లైట్ ఫుడ్ తినాలి. కేలరీలు తక్కువ ఉన్న ఆహారాలు తినాలి. బీర్ తాగినాక వెంటనే నిద్రించకూడదు. కనీసం ముప్పై నిమిషాలు అయినా గ్యాప్ ఇవ్వాల నిపుణులు చెబుతున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Next Story