- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరీంనగర్ బంద్ దేనికోసం? బీఆర్ఎస్ తీరుపై పాయల్ శంకర్ ధ్వజం
బీఆర్ఎస్ నేతల తీరుపై పాయల శంకర్ నిప్పులు చెరిగారు. కౌశిక్ రెడ్డి నోటి దురుసు వల్ల జరిగిన వివాదాన్ని ప్రజా సమస్యగా చిత్రీకరిస్తూ బంద్‌కు పిలుపునివ్వడం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలను ప్రజలు ఛీత్కరించిన వారిలో మార్పు రాకపోవడం సిగ్గు చేటు అని, ఏ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కరీంనగర్ బంద్ కు పిలుపు ఇచ్చారో చెప్పాలని బీజేఎల్పీ ఉప నేత పాయల శంకర్డిమాండ్చేశారు. శుక్రవారం ఒక ప్రటకనలో పేర్కొంటూ బీజేపీ కార్యకర్తల ఆగ్రహానికి కారణం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నోటి దురుసు ఫలితమేనని, ఇందులో ప్రజా కోణం ఏముందని నిలదీశారు. కరీంనగర్ బంద్ పేరుతో బీఆర్ఎస్ నేతలు అరాచకం చేయాలనుకుంటున్నారని, ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ కార్యకర్తల తలలు పగలకొట్టినప్పుడు దాడులు చేయడం తప్పని గుర్తుకు రాలేదా అని మండిపడ్డారు. వడ్ల కొనుగోలు కేంద్రాల పరిశీలనకు వెళ్లినప్పుడు బీజేపీ నాయకుల వాహనాలను ధ్వంసం చేసినప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడ పోయిందన్నారు.
ప్రజాస్వామ్యబద్దంగా ప్రజా సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తున్న మా పార్టీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేయించి అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపినప్పుడు తప్పని తెలియదా అని ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తల, కరీంనగర్ ప్రజల మంచి తనాన్ని, సహనాన్ని చేతకాని తనంగా చూస్తూ ఎందుకు ఊరుకోవాలని పేర్కొన్నారు. అసలు ఈ వివాదానికి మూల కారకుడు కేటీఆర్ నేని, కాందిశీకుల భూముల వ్యవహారంలో సీఎంతో, బండి సంజయ్ కుమ్కక్కయ్యారని, ఆధారాలను బయటపెడతామని అడ్డగోలు ఆరోపణలు చేసింది కేటీఆర్ కాదా అన్నారు. 48 గంటల్లో ఆ ఆధారాలను బయట పెట్టాలని డిమాండ్ చేస్తే తోకముడించారని ఎద్దేవా చేశారు. ఆధారాలు లేకపోవడంతో ప్రజల దృష్టి మళ్లించేందుకే బీఆర్ఎస్ చెంచాలతో బూతులు తిట్టిస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం మానుకోవాలని హెచ్చరించారు. ఇప్పటికే ప్రతిపక్ష నేతలు ఇకనైనా బుద్ధి తెచ్చుకుని ప్రజా సమస్యలపై పోరాడాలని, లేనిపక్షంలో ఈసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదన్నారు.






