- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తులం బంగారం హామీ ఏమైంది..?
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదింటి ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తానన్న హామీ ఏమైందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రశ్నించారు.

దిశ, సంగారెడ్డి : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదింటి ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తానన్న హామీ ఏమైందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రశ్నించారు. సోమవారం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి కూడా హాజరయ్యారు. చెక్కుల పంపిణీ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల హామీలో భాగంగా తులం బంగారం ఇస్తామన్న మాట ఏమైందని, అలాగే ప్రతి ఇంటి మహిళలకు రూ.2500 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీలను ఇంకా ఎప్పుడూ నెరవేరుస్తారని ఆయన అన్నారు. దీంతోపాటు గతంలో ఉన్న పెన్షన్ ను రూ.4 వేలకు పెంచి ఇస్తామన్న హామీ కూడా ఏమైందని ఆయన సభాముఖంగా ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.






