విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదవాలి: ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ

by Kodari Anjali |

విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదవాలని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు.

విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదవాలి: ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
X

దిశ, ఉప్పునుంతల: విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదవాలని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ఉప్పునుంతల మండల కేంద్రంలోని పియంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా నగదు బహుమతులను పంపిణీ చేశారు. ఉప్పునుంతల మాజీ సర్పంచ్ కట్ట సరితారెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అనంత రెడ్డి ప్రస్తుత సర్పంచ్ చింతగాళ్ళ శ్రీనివాసులులఆర్థిక సహకారంతో 25వేలు నగదు బహుమతులను విద్యార్థులకు అందజేశారు. గత 2024-25 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో 563 మార్కులతో ప్రథమ స్థానం సాధించి ట్రిపుల్ ఐటీ సీటు పొందిన అక్కల నందిని, 557 మార్కులతో ద్వితీయ స్థానం సాధించిన మేడిపూరి పూజ గత 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఫలితాలలో 557 మార్కులతో ప్రథమ స్థానం సాధించిన నామని సంజన, 556 మార్కులతో ద్వితీయ స్థానం సాధించి ట్రిపుల్ ఐటీ బాసర లో సీటు పొందిన నడిగడ్డ కీర్తి, గోరెంట్ల సాయికుమార్ లకు నగదు బహుమతులు అందించారు.

మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటూ ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించడం పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చిన దాతలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి అభినందించారు. విద్యార్థులు ఇదే పట్టుదలతో భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల రాజస్వ ప్రధానోపాధ్యాయులు జటప్రోలు శ్రీనివాస్ రెడ్డి, తహసిల్దార్ అద్దంకి సునీత, గ్రామ సర్పంచ్ చింతగాళ్ళ శ్రీనివాసులు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కట్టా అనంతరెడ్డి, ఉపసర్పంచ్ శైలజ వెంకటయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీపీ తిప్పర్తి అరుణ నరసింహారెడ్డి, సింగల్ విండో చైర్మన్ మడ్డు నరేందర్ రెడ్డి, డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, ఉపాధ్యాయులు నీల శ్రీధర్, పోకల సతీష్, శ్యాంసుందర్ గౌడ్, అజ్మతుల్లా, శ్రీనివాసులు, మల్లారెడ్డి, గోపి, రాజవర్ధన్ రెడ్డి, రాజు, శ్యామల గౌరి, బిల్క్విస్, శ్రీలత, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Next Story