సమాచారం ఇవ్వని మున్సిపల్ అధికారులపై సమాచార కమిషన్‌కు అప్పీలు

by Ratna Kumari |

సమాచార హక్కు కింద కోరినసమాచారంఇవ్వకపోవడంతో సంగారెడ్డి మున్సిపాలిటీ ప్రజా సమాచార అధికారి, మొదటి అప్పిలెట్ అధికారి అయిన మున్సిపల్ కమిషనర్‌పై సామాజిక కార్యకర్త ఎం.శ్రీధర్ తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్‌లో రెండవ అప్పీలు దాఖలు చేశారు.

సమాచారం ఇవ్వని మున్సిపల్ అధికారులపై సమాచార కమిషన్‌కు అప్పీలు
X

దిశ,సంగారెడ్డి అర్బన్ : సమాచార హక్కు కింద కోరినసమాచారంఇవ్వకపోవడంతో సంగారెడ్డి మున్సిపాలిటీ ప్రజా సమాచార అధికారి, మొదటి అప్పిలెట్ అధికారి అయిన మున్సిపల్ కమిషనర్‌పై సామాజిక కార్యకర్త ఎం.శ్రీధర్ తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్‌లో రెండవ అప్పీలు దాఖలు చేశారు. మార్చి 30, 2026న బైపాస్ రోడ్డు సర్వే నెంబర్ 210, లేఅవుట్ నెంబర్ 368/లోని 80 ఫీట్ల రోడ్డులో జరుగుతున్న అక్రమ నిర్మాణంపై ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ నివేదికలు, తీసుకున్న చర్యల సమాచారం కోరుతూ శ్రీధర్ దరఖాస్తు చేశారు. అలాగే హెచ్‌ఎండీఏ లేఖ నెం.17735/SKP/PLG/HMDA/2025 ప్రకారం సర్వే 403లోని లేఅవుట్ పార్క్ స్థలంలో జరుగుతున్న నిర్మాణంపై విచారించి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌కు వచ్చిన లేఖపై తీసుకున్న చర్యలు, మున్సిపాలిటీలో వాడుతున్న అద్దె వాహనాల వివరాలు కోరారు.గడువు ముగిసినా సమాచారం ఇవ్వకపోవడంతో ఏప్రిల్ 30, 2026న మున్సిపల్ కమిషనర్‌కు మొదటి అప్పీలు చేశారు. అయినా ఎలాంటి విచారణ జరపకుండా, సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. దీంతో జూన్ 29 సోమవారం న రాష్ట్ర సమాచార కమిషన్‌లో రెండవ అప్పీలు వేసినట్లు శ్రీధర్ తెలిపారు.

Next Story