తెలంగాణ ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ భారీ గుడ్ న్యూస్

by Gantepaka Srikanth |

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది.

తెలంగాణ ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ భారీ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బకాయిల (Employee Dues) చెల్లింపుల కోసం ప్రభుత్వం సోమవారం మరో రూ. 2,000 కోట్ల నిధులను విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి (ఆర్థిక శాఖ మంత్రి) మల్లు భట్టి విక్రమార్క సంయుక్తంగా జరిపిన సమీక్ష అనంతరం, ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ నిధుల విడుదలకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు.

నెల వ్యవధిలోనే రూ.4,000 కోట్లు..

ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులు, వారి న్యాయమైన డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిధులను విడతల వారీగా అన్‌లాక్ చేస్తోంది. ఇందులో భాగంగానే గత నెల 29న మొదటి విడత కింద రూ.2,000 కోట్ల బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే క్లియర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు మరో రూ. 2,000 కోట్లు విడుదల చేయడంతో.. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ. 4,000 కోట్ల మేర ఉద్యోగుల పెండింగ్ బకాయిలను ప్రభుత్వం చెల్లించినట్లయింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో పీఎఫ్, జీపీఎఫ్, సరెండర్ లీవ్లు, మెడికల్ బిల్లులతో పాటు రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ నిధుల చెల్లింపులకు మార్గం సుగమమైంది. ప్రభుత్వ ఈ ఆర్థిక ప్యాకేజీపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story