- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్లారెడ్డి ప్రధాన రహదారి పై మురుగు నీటి ప్రవాహం
by Batti.Sumithra |
ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతుండటంతో ప్రధాన రహదారి పై మురుగునీరు ప్రవహిస్తోంది.

X
దిశ, ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతుండటంతో ప్రధాన రహదారి పై మురుగునీరు ప్రవహిస్తోంది. దీంతో రహదారులన్నీ దుర్వాసన వెదజల్లుతుండగా, ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా మురుగు కాలువల నిర్మాణ పనులు చేపట్టిన అధికారులు, నీరు దిగువకు వెళ్లేలా చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు, ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు విపరీతంగా పెరిగి, రోగాల బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, మురుగునీరు రోడ్డు పై ప్రవహించకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Next Story






