- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్.. స్పందించిన జిల్లా అధికారులు
కారేపల్లిలో విద్యార్థుల ఆధార్ అప్‌డేట్ పేరుతో అధిక మొత్తంలో వసూళ్లు జరుగుతున్నాయంటూ ఈ నెల 27న దిశ పత్రికలో ప్రచురితమైన కథనానికి జిల్లా స్థాయి అధికారులు స్పందించారు.

దిశ, కారేపల్లి : మండల కేంద్రమైన కారేపల్లిలో విద్యార్థుల ఆధార్ అప్‌డేట్ పేరుతో అధిక మొత్తంలో వసూళ్లు జరుగుతున్నాయంటూ ఈ నెల 27న దిశ పత్రికలో ప్రచురితమైన కథనానికి జిల్లా స్థాయి అధికారులు స్పందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) జయరాజు సంబంధిత ఆధార్ కేంద్రం పై ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆధార్ అప్‌డేట్ కోసం వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకుని విచారణ చేపట్టారు. విచారణలో ప్రభుత్వం నిర్ణయించిన రూ.75 సేవా రుసుముకు బదులుగా రూ.150 వరకు వసూలు చేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ దిశలో ప్రచురితమైన కథనం నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఘటన పై సమగ్ర విచారణ చేపట్టి పూర్తి నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు సమర్పిస్తామని పేర్కొన్నారు.






